Bara Shaheed Dargah located in Nellore, AP, India. రొట్టెల పండుగ, నెల్లూరు

                                            Bara Shaheed Dargah located in Nellore, AP, India.

 రొట్టెల పండుగనెల్లూరు



 Bara Shaheed Dargah located in Nellore, AP, India.
                    బారా షహీద్ దర్గా, నెల్లూరు
                        దాదాపు 400 సంవత్సరాల క్రితం అంటే 1751 లో సమాజ శ్రేయస్సు కోసం సౌదీ నుంచి మక్కా షరీఫ్నుంచి 12 మంది వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు. సమయంలో కర్ణాటకలో హైదర్అలీ పరిపాలన, నెల్లూరులో నవాబుల పరిపాలన ఉండేది.   ఇస్లాం మత ప్రచారం కోసం వచ్చిన తరఖ్మాన్ల్దేశంలో పర్యటిస్తూ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చెరువు వద్ద ఇస్లామేతరులకు, తరఖ్మాన్లకు యుద్దం జరిగింది.

         యుద్దంలో తరఖ్మాన్లు ప్రాణ త్యాగం చేశారు. అలా ప్రాణ త్యాగం చేసిన వారిలో 12 మంది (బారాశహీద్లు) మొండాలను గుర్రాలు తీసుకుని వచ్చి నెల్లూరులోని దర్గామిట్ట నెల్లూరు చెరువు వద్ద పడేశాయి. మొండాలు భూమిలో కలిసి అక్కడే వారు సమాధులయ్యారు.భక్తులు ప్రదేశం లోనే వారికి సమాధులు వరుసగా నిర్మించి ఆరాధించడం మొదలెట్టారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మొహరం నెలలో జరిగే గంధ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది భక్తులు హాజరవుతుంటారు.
                   Bara Shaheed Dargah located in Nellore, AP, India. "Bara Shaheed Dargah" literally reads "Shrine of twelve martyrs" inUrdu. Dargah is on the bank of Nellore water tank/lake, and has eid-gah, tourist resort and park next to it. Dargah is known for annual festival of Rotiyaan ki Eid/Rottela Panduga in the month of muharram in hijri and attracts followers from across the country and abroad.
As per local tradition and according to stone slate in the campus of dargah that reads in Persian, they were twelve tombs of warriors part of first Muslim army to enter into the region and were martyed in the battle.





                           రొట్టెల పండుగ, నెల్లూరు

         మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, మరియు నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే పండుగను రొట్టెల పండుగ అంటారు. రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు.మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారు.ఆర్కాటునవాబు కోరిక నెరవేరడం తో మరుసటిఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ,చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం. సంఘటనానంతరమే రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు.1930 లలో రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతూ, స్థానిక పత్రికల లో నమోదు అయివున్నట్లు తెలుస్తుంది.ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలు(రొట్టెలు)చెరువు లోని నీళల్లో దిగి తలపై ముసుగువేసుకొని మార్పిడి చేసుకుంటారు భక్తులు.
            ఆరోగ్యం గురించి మొక్కు కొంటె ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టెకావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు.ఇలాగే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె ,సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె,వీసా రొట్టె,అభివృద్ధి రొట్టె,సమైక్యాంధ్ర రొట్టె...ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు .వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని చెరువు నందు వదిలేస్తారు.
ఇది ఫలానా కోర్కెకు సంబంధించిన రొట్టె అని సులభంగా గుర్తించేందుకు బ్యానర్లు ఏర్పాటు చేస్తారు.
మత సామరస్యం కు ప్రతీకగా జరిగే రొట్టెల పండుగలో రొట్టెలు మార్పిడి చేసుకొన్నభక్తులు జిల్లా లోని కసుమూరు ,అనుమసముద్రం పేటలలోని దర్గాల ను కూడా సందర్శిస్తారు.చెరువు వద్ద వున్న ఎపి టూరిజం వారు ఏర్పాటు చేసే బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.రొట్టెల పండుగ జరిగే సమయంలోనే బారా షహీద్ దర్గా లో గంధ మహోత్సవం జరుగుతుంది.

              రొట్టెల పండుగను ప్రారంభించిన ఆర్కాటు నవాబు

          ఆర్కాటు నవాబుల కాలంలో నెల్లూరు చెరువు వద్ద రజకులు బట్టలు ఉతికేవారు. సందర్భంలో రజకులైన భార్యాభర్తలు చెరువులో బట్టలు ఉతుకుతుండగా పొద్దు పోవడంతో అక్కడే నిద్రపోయారు. రజకుని భార్యకు అక్కడ సమాధులైన బారాషహీద్లు కలలోకి వచ్చి ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది, సమాధుల ప్రక్కనున్న మట్టిని తీసుకెళ్ళి ఆమె నుదిటిపై రాస్తే కోలుకుంటుందని చెప్పారు.
                                        ఉదయాన్నే భార్యభర్తలిద్దరు గ్రామంలోకి వెళుతుండగా ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది ఆమెకు సరైన వైద్యం చేసినవారికి విలువైన బహుమతి అందజేస్తామని దండోరా వేయిస్తుంటారు. విషయాన్ని తెలుసుకున్న రజకుడు తన భార్యకు కలలో వచ్చిన విషయాన్ని నవాబు ఆస్ధానంలో వున్న వారికి వివరిస్తారు. దీంతో రాజు తన అనుచరులను నెల్లూరు చెరువు వద్దకు పంపి అక్కడి మట్టిని తెప్పించుకుని రాజు భార్య నుదుటిపై పూస్తారు. వెంటనే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది. దీంతో రాజుకు పట్టలేనంత సంతోషంతో తన భార్యతో కలసి నె ల్లూరు చెరువు సమీపంలోని సమాధుల వద్దకు వచ్చి బారాషహీదులకు ప్రార్ధనలు చేసి, తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్లో కొన్నింటిని అక్కడి వారికి పంచుతారు. అలా అప్పటి నుండి రోజు వరకు ఆనవాయితి ప్రకారం రొట్టెల మార్పు జరుగుతోంది. కోర్కెలు తీరిన వారు రొట్టెలను తీసుకుని దర్గా వద్ద చెరువులో తడిపి మరొకరికి ఇవ్వడం, కోర్కెలు కోరుకునే వారు వాటిని తీసుకోవడం అప్పటి నుంచి ఆచారంగా వస్తున్నది. ఇలా విధంగా రొట్టెలు మార్పు చేసుకోవడం అది రొట్టెల పండుగగా మారింది. అప్పట్లో పండుగను మొహరం నెలలోఒక్కరోజు మాత్రమే జరుపుకునేవారు. కాలగమనంలో భక్తుల తాకిడి ఎక్కువై కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొంటుండంతో పండుగ 4 రోజులుగా జరుపుకుంటున్నారు.
1.    24/10/2015……………………starting
2.    25/10/2015………………….. గంధ మహోత్సవం
3.    26/10/2015…………………..Rottela Panduga





                                                      Rotiyaan ki eid

             Its one of revered shrines in Nellore District that attracts visitors from across the country and abroad including some celebraties who visit the ursfestival. An annual three day urs Rotiyaan ki Eid/Rottela Panduga is observed in the month ofMuharram.
Visitors exchange their roti(flat bread) with those who had similar wish as theirs and was completed(fulfilled), followed byfatihah in dargah.Urs(Festival) has evolved from time to time and can be attributed to Sufism.

                                                   Eid Gah

Dargah also hold eid gah in its compound, site for Eid prayers(congretional prayers) on Eid ul fitr(Ramzan) and Eid al-Adha(Bakrid) and being the biggest eid gah in the city.

·         24/10/2015……………………starting
·         25/10/2015………………….. గంధ మహోత్సవం
·         26/10/2015…………………..Rottela Panduga
                                                   HAPPY EID....MUBARAK















Comments

Post a Comment

Popular posts from this blog

MANAGERIAL ECONOMICS AND FINANCIAL ANALYSIS (2MARKS) B.TECH MEFA ALL 5 UNITS

MEFA 2 Marks Questions and Answers

PENCHALA KONA